సప్త ఖండ అవధాన సాహితీ ఝరిసప్త ఖండ అవధాన సాహితీ ఝరిfavorite_border

Start Dateప్రారంభపు తేది
Saturday, September 11, 2021
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః

"సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" లో భాగంగా "ఆసియా" ఖండంలో వేద సంస్కృతి, సంప్రదాయలకు, సనాతన ధర్మానికి నిలయమైన మన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి పండితులు, భాషాకోవిదులు, హేమాహేమీలైన పృచ్ఛకులతో శ్రీప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధానులు, ఆంధ్రభాషా భూషణ, ధారణావేదావధాననిధి సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1235 వ అష్టావధానం!

సెప్టెంబరు 11వ తేది, 2021 (శనివారం), ఉ.8.00 గం.లకు (భారత కాలమానప్రకారం) జరుపుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

ఈ అవధానం లో ప్రఖ్యాత సినీగేయ రచయిత, సాహితీవేత్త, "పద్మశ్రీ" శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు, ప్రముఖ పాత్రికేయులు, శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మాశర్మగారు, ప్రపంచనేతలను సైతం ముగ్ధులను చేసిన కూచిపూడి నృత్యకళాకారిణి "కళారత్న" డా. శ్రీమతి మల్లంపల్లి మాధవి గారు విశిష్ట ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తున్నారు. సంచాలకులుగా సుప్రసిద్ధ అమెరికా అవధాని శ్రీ గురుదేవుల అనుంగుశిష్యులు శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు వ్యవహరించనున్నారు.

తెలుగువారికి అతి దగ్గరైన సాహిత్యపు క్రీడావిశేషం, మనసుకు ఆహ్లాదం, బుద్ధికి వికాసం కలిగింపజేసే అద్భుత కళారూపమైన అవధానాన్ని అపరసరస్వతీ స్వరూపులు శ్రీగురుదేవులు చేస్తుండంగా చూడటం మన మహద్భాగ్యం. ఈ మహత్తర కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమంగా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును. పదిమందికీ తెలియజేయండి, పసందైన సాహిత్యపు విందును ఆస్వాదించండి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

బలం గురోః ప్రవర్ధతాం!

expand_less