Yatra Instructionsయాత్ర సూచనలు


 శ్రీ మహాగణాధిపతయే నమః
          శ్రీ గురుభ్యో నమః
          పూజ్యగురువులకు జయము జయము

     తీర్థయాత్ర చేయు గురుభక్తులకు తగు సూచనలు

1)అనేక జన్మల పుణ్యఫలితము వలన మనకు పూజ్యగురువులు  బ్రహ్మ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని అనుసరిస్తూ  ధర్మబద్ధంగా తీర్థయాత్రను చేసుకునే  అవకాశం, అదృష్టం కలిగింది.

2)యాత్ర చేయగోరువారు సాధారణ నియమాలు పాటిస్తూనే  గురుభక్తితో యాత్ర చేయవలెను.

3)యాత్రలో కలిగే చిన్న చిన్న అసౌకర్యాలకు చింతించకుండా,పారాయణముపైన, భగవద్దర్శనం పైన ధ్యాసపెట్టి గురుభక్తితో యాత్రను పూర్తి చేసుకోవలెను.

4)యాత్రలో అనవసరమైన మాటలు మాట్లాడకుండా గురునామస్మరణచేస్తూ పూర్తి చేయవలెను.

5)యాత్రలో ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు సామరస్యముగా  పరిష్కరించుకుంటూ భగవంతుడిని దర్శించుకోవలెను.

6)యాత్రలో భాగమైన పారాయణ కార్యక్రమాలకు ఆటంకము కలిగించకూడదు. శ్రద్ధాసక్తులతో పాల్గొనవలెను.

7)ఇది విహారయాత్ర కాదు, తీర్థయాత్ర. పూజ్య గురువులను అనుసరిస్తూ మనల్ని మనం ఉద్దరించుకోవటానికి చేస్తున్న యాత్ర. అందువల్ల యాత్రలో ఇతర విషయములపట్ల ఆసక్తివదిలి గురుభక్తితో గురువుగారిని అనుసరించవలెను. 

8)సహనం,నమ్మకం  అన్నిటికీ మించి గురుభక్తితో ఉండాలి. సౌకర్యముల కోసం,విహారముల కోసం రావాలి అనుకున్నట్లయితే మీరు ఈ యాత్రను విరమించుకొనవచ్చును.

9)తోటిభక్తులందరిననీ గురుస్వరూపులుగా చూడాలి.అనవసరమైన సంభాషణలు, వాదోపవాదాలు మానుకొని, చిన్న సమస్యలు నిర్వాహకుల దృష్టివరకు తీసుకొనిరాకుండా  పరిష్కరించుకోవలెను.

10) కొండెములు చెబుతూ , అబద్ధములాడుతూ , నిర్వాహకులకు  ఇబ్బందులు కలిగిస్తూ, ఇతర అనవసర విషయములపై ఆసక్తితో మీ యాత్రను వృధాచేసుకోవద్దు. గురువుగారితో తీర్థయాత్ర మహామోక్షసాధనము.
expand_less