శ్రీ గురుభ్యోనమః గుడి - బడి (8 వ కార్యక్రమం) భాగ్యనగరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం(పర్వతాపురం,ఉప్పల్) (నవంబర్ 7,2021) లోకకల్యాణార్థం ప్రతినెలా మన ఊరిలో ఉన్న ఏదో ఒక ఆలయం లో భక్తులు అందరూ కలిసి, యథాశక్తి ఆలయం శుభ్రంచేసి, భగవత్ విషయాలు లేదా స్తోత్ర పారాయణము చేసి తరించమని, ఇందువల్ల మనలో ఐక్యత పెరుగుతుందని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మనల్ని ఆదేశించారు. గురువుగారి ఆశీస్సులతో గుడి-బడి 8 వ కార్యక్రమం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం(పర్వతాపురం, పీర్జాదిగూడా, ఉప్పల్) భాగ్యనగరం ఈ పవిత్ర కార్తికమాసం లో ఏ చిన్న సేవ చేసినా అనంత పుణ్యం ఇస్తుంది. అలాంటిది ఒక ఆలయం శుభ్రంచేయడం మన అదృష్టం. ధర్మరాజు తన పూర్వజన్మలో 3 సం|| ఆలయం శుభ్రం చేయడం వల్ల మరుసటి జన్మలో అంతటి గొప్ప చక్రవర్తి, ధర్మాత్ముడు అయ్యాడు. ఆ స్ఫూర్తితో ప్రతినెలా మనకు దగ్గరలో ఉన్న ఏదో ఒక ఆలయం శుభ్రం చేద్దాం. మనం తరించి భవిష్యత్ తరాలకు మార్గం చూపుదాం! ముఖ్యంగా పిల్లలని ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనేట్లు చేద్దాం! ఉ౹౹ 8.15 ఆలయం చేరడం 8.30- 11 వరకు ఆలయం, శుభ్రం చేయడం 11-12గం౹౹ వరకు భజన, స్తోత్రపారాయణము 12గం౹౹ ప్రసాద స్వీకరణతో కార్యక్రమం ముగుస్తుంది. Location :- https://maps.app.goo.gl/2Sf9EPyeasaVSdTo9 For more details - raghava garu 9182668060 Suresh garu 9000906147 Landmark Opp. Uppal Lake Arch(peerzadiguda) From Uppal Busstop - 2KM From Uppal metro -2.5KM గురువుగారి ప్రవచనాలతో ప్రేరణ చెందిన మనం అందరం ఇలా ప్రతి ఊరిలో సత్సంగం నిర్వహించుకుందాం. హైందవ ధర్మం పరిరక్షిద్దాం