పేరు : బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్
తల్లిదండ్రులు: బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావు గారు , శ్రీమతి శేషమణి గారు
అష్టావధానాలు : 1225 పూర్తి చేశారు
శతావధానాలు : 11
- ఏలూరు
- విశాఖపట్నం
- తాడేపల్లిగూడెం
- చల్లపల్లి
- గుంటూరు
- రాజమండ్రి
- నరసరావుపేట
- హైదరాబాదు
- సికింద్రాబాద్
- హైదరాబాదు
- సికింద్రాబాదు
జంట అవధానాలు :
- శ్రీ కొండేపి మురళీ కృష్ణ గారితో కలిసి 6 మరియు శ్రీ శ్రీచరణ్ పాలడుగు గారితో 2 అవధానములు నిర్వహించినారు
హిందీ అవధానం :
- సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, ఆగ్రాలో హిందీలో అవధానం చేసి ప్రముఖుల ప్రశంసలు పొందిన ఏకైక త్రిభాషా మహాసహస్రావధాని
త్రిభాషా మహాసహస్రావధానం:
- ఏలూరులో ఆంధ్ర, హిందీ, సంస్కృతభాషలలో మహావధానం చేశారు.
అద్వితీయ ధారణ :
- 756 పద్యాలు కదలకుండా 207 ని॥లలో (3గం॥27॥ ని ॥లలో) ధారణ చేసిన ఏకైకసహస్రావధాని.
- భాగవతంలోని వేలాది పద్యాలు, ప్రాచీన కావ్యాలలోని వేలాది పద్యాలు ఆసువుగా చెప్పగలరు.
మరొక ప్రత్యేకత :
- భారత, భాగవత, రామాయణాలే కాక అష్టాదశ పురాణాలను ఉపన్యసించి, అంబికావారి ఆస్థాన పౌరాణికునిగా నియమితులైన ఏకైక సహస్రావధాని.
బిరుదులు :
- అభినవశుక
- ఆంధ్రమురారి
- ఆంధ్రభాషా భూషణ
- సరస్వతీపుత్ర
- కవిరాజశేఖర
- అవధానకోకిల
- ధారణాచిత్రగుప్త (జొన్నవిత్తుల వారు ఇచ్చారు)
- భాగవత కళ్యాణకృష్ణ
- పంచామృత ప్రవచక
- సహస్రపద్మ
- పౌరాణిక సార్వభౌమ
- ధారణా వేదావధాననిధి (శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇచ్చారు)
భాగవతసప్తాహ ప్రత్యేకత :
- ఆంధ్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ,తమిళనాడులోను, నైమిశారణ్యము, శుకస్థల్, బృందావనాది పుణ్యక్షేత్రాలలోను భాగవత సప్తాహాలు చేశారు.
- భాగవతం మొత్తం పుస్తకం లేకుండా ప్రవచనం చేయగలిగిన ఏకైక సహస్రావధాని
- వింధ్యాచలంలో దేవీ భాగవత నవాహ ప్రవచనములు చేసినారు.
సమర్థ సద్గురత్వము :
- దాదాపు 1,00,000 మందికి పైగా మంత్రోపదేశాలు చేసి వారిని ఆధ్యాత్మికమార్గంలో నడుపుతూ ప్రణవ పీఠం స్థాపించి శిష్యుల చేత ‘సమర్థ సద్గురు’ బిరుదు పొందిన అవధాని.
సన్మానాలు :
- పల్లకీ ఊరెరిగింపు (ఏలూరు)
- హెలికాప్టర్ అధిరోహణ
- సువర్ణ కంకణధారణ
- రథారోహణ, బృందావనం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్, ఇవి కాక అసంఖ్యాకంగా ప్రజా సత్కారాలు
- ఏలూరులో గజారోహణ మరియు గండపెండేర సత్కారాలు.
రచనలు :
- కలకింకిణులు(ముద్రితం)
- శ్రీ సత్యసాయి సప్తశతి(ముద్రితం)
- శ్రీనీలకంఠేశ్వర శతకం(ముద్రితం)
- హనుమన్మహిమ(అముద్రితం) 750 పద్యాల ఖండ కావ్యం, ‘మానవకథ’ పద్యకావ్యం, ఇంకా పలు కథలు, వ్యాసాలు.
రూపకాలు :
- వందలాది రూపకాలు నిర్వహించారు, భువన విజయంలో తెనాలి రామకృష్ణ, అవధాని విజయంలో చెళ్ళపిళ్ళ, సుధర్మా సభలో నారద పాత్రలు ప్రత్యేకాలు.
ఆశు కవితలో ప్రత్యేకత:
- 90 ని॥లలో 180 పద్యాలు ఆశువుగా చెప్పుట.
పాదయాత్రా ధురీణత :
- వేలాది భక్తులతో ఆంధ్రాలోని ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయం మొదలైన ప్రముఖ దేవాలయములకు పాదయాత్ర చేయించుట.
పీఠాధిపతుల సత్కారాలు :
- శృంగేరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు
- శ్రీసత్యసాయిబాబా
- శ్రీగణపతి సచ్చిదానందస్వామిజీ
- శ్రీవిశ్వయోగి విశ్వంజీ
- శ్రీవాడేకర్మహారాజ్ వంటి ప్రముఖ పీఠాధిపతుల సత్కారాలు పొందారు.
ఆస్థాన విద్వాంసులు :
- 2003సం॥ మే నెల నుండి అవధూత దత్తపీఠము మైసూర్ వారి ఆస్థానవిద్వాంసులుగా నియమింపబడిరి.
విదేశీ పర్యటనలు :
- పురాణ ప్రవచనములు, సాహిత్యోపన్యాసాలు, అవధానాల నిమిత్తం సం॥ 2006 నుండి ప్రతి సంవత్సరము ఏప్రిల్, మే నెలలో అమెరికా లో ఉన్న కొన్ని ముఖ్యమైన పట్టణాలలో పర్యటిస్తుంటారు.
- సింగపూర్ లో ది.29-04-2006 నుండి ది.05-05-2006 వరకు అవధానాలు ప్రవచనాలు చేశారు చేశారు.
- దుబాయిలో ది.01-04-2008 నుండి ది.06-04-2008 వరకు పంచాంగ ప్రవచనములు, పురాణ ప్రవచనములు చేసారు