సరస్వతీ పుత్ర, పౌరాణిక సార్వభౌమ, భాగవత కళ్యాణకృష్ణ బిరుదులున్న బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు నేటికి అష్టాదశ (18) మహాపురాణాలను 3 సార్లకు పైగా ప్రవచనం చేసిన అద్వితీయ, సుప్రసిద్ధ ప్రవచనకారులు, త్రిభాషామహాసహస్రావధానులు. ఒక ఆధ్యాత్మికశక్తిగా, సాహితీవేత్తగా, ధర్మాచరణకు స్ఫూర్తిగా వారి కీర్తి విశ్వవ్యాప్తం. మన తరఫున గౌరవసూచకంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని 2022వ సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కారానికి ప్రతిపాదించుకోవడం మన వంతు బాధ్యత. https://applypadma.mha.gov.in/ ద్వారా లాగిన్ అయ్యి నామినేషన్ పూర్తి చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా లాగిన్ అయ్యి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. నామినేషన్ ప్రక్రియను మీకోసం సులభతరం చేయడానికి మాత్రమే ఈ ఫారమ్ పంపుతున్నాము, దీనిని నింపడం వలన నామినేషన్ పూర్తి అయినట్లు కాదు. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ నామినేషన్ కు విడివిడిగా ఒక్కొక్క ఫారం ను నింపగలరు. తద్వారా నామినేషన్ ప్రక్రియలో మీకు అవసరమైతే మీ అనుమతితో మా వాలంటీర్స్ సహాయ సహకారాలు అందించగలరు. ఏమైనా సందేహాలకు ఈ నంబర్లను సంప్రదించగలరు ఈ క్రింది ఇవ్వబడిన వాట్సాప్ లంకె ద్వారా జాయిన్ అవ్వగలరు https://chat.whatsapp.com/KuOMMPlXFBv21b1WaSrJbk లేదా padma.awards1@gmail.com కు ఇమెయిల్ చెయ్యగలరు. https://forms.gle/eELM4UjKHGuniDkK7 ముఖ్య గమనిక: దయచేసి పీఠం నంబర్లకు ఈ విషయం గురించి ఎటువంటి ఫోన్లు చేయవద్దని సవినయ మనవి.