ప్రణవపీఠంకు భూదానం చేయు అవకాశంప్రణవపీఠంకు భూదానం చేయు అవకాశంfavorite_border

పూజ్య గురుదేవులకు జయము జయము

           శ్రీ గురుభ్యోనమః
     శ్రీ మహా గణాధిపతయేనమః
     శ్రీ ఉమా మహేశ్వరాయనమః

            
               మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మన ప్రణవపీఠంలో శ్రీ సత్యధర్మేశ్వరుడు, శ్రీ పద్మేశ్వరుడు, శ్రీ రంగేశ్వరీ మాత, శ్రీ రత్నగర్భ గణపతి దేవతా మూర్తులను ప్రతిష్ఠించిన విషయం మనందరికీ విదితమే

     శివలింగానికి అభిషేకము చేసిన జలమంతా బిల్వ వనములోకి మళ్లించాలని గురుదేవుల సంకల్పం . ఆ దివ్య సంకల్పానికి అనుగుణంగా పీఠంలో ఖాళీగా ఉన్న స్థలంలో అనేక బిల్వ వృక్షములు నాటడం జరిగింది.

              చాలా మంది భాగవతులు గురుదేవులకు, మరియు వారి శిష్య బృందమునకు ఫోన్ చేసి మేము కూడా బిల్వ వృక్షములు పంపుతాము, నాటవలసిందిగా కోరుతున్నారు. మన పీఠంలో ఉన్న ఖాళీ స్థలామంతా బిల్వ వృక్షములు నాటడం జరిగింది. ఇక ఖాళీ స్థలము లేదు. భక్తుల అభ్యర్థనలు విన్న గురువుగారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది

           మన పీఠమునకు ఎదురుగా ఉన్న 330 గజముల ఖాళీ స్థలాన్ని కొని దానిలో సగ భాగం బిల్వ వనమునకు, మిగితా సగ భాగము మన పీఠమునకు విచ్చేయు భక్తుల వాహనములు నిలుపుటకు పార్కింగ్ స్థలముగా ఏర్పాటు చేయుటకు నిర్ణయించడం జరిగింది

                         దానములలోకెల్ల అత్యుత్తమమైనది భూదానము. గొచర్మమంత దానం చేసినా అనంతమైన ఫలితం లభిస్తుంది

    భూమిదానం వినిశ్చిత్య
     సర్వదానోత్తమోత్తమం
      ప్రాపకం పరలోకస్య
      సర్వకామ ఫలప్రదం

                    మహానుభావులకు, పీఠాధిపతులకు, మంచి పనులకు భూమిని దానం చేస్తే తిరుగులేని పుణ్యం, సంపదలు పొందగలము

    భూదానం ఇచ్చినవాడికి, పుచ్చుకున్నవాడికి పుణ్యం లభిస్తుంది

  శ్రీమద్ భాగవతము లో వామనమూర్తి బలి చక్రవర్తితో అన్న పలుకులే మనకు ప్రమాణం

  క్షితి దానమిచ్చునతడును
  అతికాంక్ష పరిగ్రహించునతడును
  దురితచ్యుతులై శతవర్షంబులు
  శతమఖలోకమున క్రీడ
  సలుపుదురెలమిన్

        భూదానము ఇచ్చినవాడును, భూదానము పుచ్చుకున్నవాడును ఇహలోకంలో సంపదలు పొందడమే కాకుండా ,నూరు సంవత్సరాల పాటు స్వర్గ లోకంలో విహరిస్తారు

  అంత గొప్పది భూదానము

                     
  అందుకని ఈ స్థల సేకరణకు కావలసిన ధనం మనమంతా భూదానముగా గురుదేవులకు సమర్పించుకుందాం. ఒక గజం స్థలం 15,000 రూపాయలు (Registration charges కలుపుకొని).రాబోయే కాలంలో మన పీఠానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశములు పుష్కలంగా ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని మనము ఆ స్థలాన్ని కొని బిల్వ వనము, మరియు పార్కింగ్ స్థలము ఏర్పాటు చేయుటకు గురుదేవులకు సహకరిద్దాం. మన పేరునగాని, మన పితృదేవతల పేరునగాని భూదానము చేసుకుని తరిద్దాం, పది మందిని తరింపజేద్దాం.

     ఆసక్తి గల భాగవతులు ఈ క్రింది బ్యాంకు అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ 9885700560 నెంబర్ నకు వాట్సాప్ ద్వారా గోత్ర నామములతో సహా పంపవలసిందిగా ప్రార్థన. భాగవతులు ఒక గజం, నుండి ఎన్ని గజాలైనా భూదానం చేసుకోవచ్చు. ఈ భూదాన యజ్ఞంలో మనమందరము పాల్గొందాం. మనందరి అభీష్టం మేరకు గురుదేవులకు ఆ స్థలం సేకరించి ఇచ్చి బిల్వవనము ఏర్పాటు చేసుకుందాము. మనం తరిద్దాం, మన పితృదేవతలను తరింపజేద్దాం 

       ACCOUNT DETAILS

    SRINIDHI ENTERPRISES
    CURRENT ACCOUNT
     ICICI BANK
    AC.NO.112305001378
     IFSC Code ICIC0001123
    PADMARAO NAGAR
       BRANCH
     SECUNDRABAD.

                    ఇట్లు

       ప్రణవపీఠం శిష్యబృందం
          శ్రీ గురుభ్యోనమః

            ముఖ్య సూచన
    
  భాగవతులు భూదానం చేద్దామని సంకల్పించుకున్నవారు త్వరపడండి. ఆలస్యం, అమృతం, విషం అన్నారు. గురుదేవులు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ స్థలం మన చేజారి పోకుండా ఉండాలంటే మనం త్వరగా నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమయింది. స్థలం యజమాని మనస్సు మార్చుకొనకముందే మనం స్థలాన్ని కొని గురుదేవులకు సమర్పిద్దాం. సత్కార్యానికి ఆలస్యం చేయవద్దని ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవద్దని మరి మరి కోరుతున్నాము. ఒక గజం స్థలం భూదానానికి registration charges కలుపుకొని 15,000 రూపాయలు

                 ఇట్లు

     ప్రణవ పీఠం శిష్య బృందం

expand_less