Details వివరాలు
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పూజ్య గురువులకు జయము జయము
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహా గణాధిపతయేనమః
శ్రీ మాత్రేనమః
మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు వారి నిర్వహణ ద్వారా 2022 సంవత్సరములో మోక్షపురియైన హరిద్వార్ లో "భాగవతశ్రవణము"చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు.
జూన్ 24 నుండి జూన్ 30 వరకు శ్రీమద్ భాగవత సప్తాహం. జూన్ 30 వ తేదీ " దధిమధనం, అవభృథస్నానం, పూజ్య గురువులకు సన్మానం." మున్నగు కార్యక్రమములుండును.అనంతరం హరిద్వార్ లో " చండీదేవిని మరియు మానసాదేవిని" దర్శించుకొనుట.
కేవలము భాగవత సప్తాహంలోనే పాల్గొనేవారికి జూన్ 30 వ తేదీ రాత్రి హరిద్వార్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణం.జూలై 1 వ తేదీ ఉదయం ఢిల్లీ నుండి వారి గమ్యస్థానాలకు ప్రయాణం.
ఇక హరిద్వార్ లో పూజ్య గురువుల భాగవత సప్తాహము తో బాటు చార్ ధామ్ యాత్రకు వచ్చిన భాగవతులకు జూలై ఒకటవ తేదీ ఉదయం అల్పాహారం, కాఫీ స్వీకరించిన అనంతరం" చార్ ధామ్"యాత్ర ప్రారంభము.
త్వరలోనే రైలు కు సంబందించిన వివరములు తెలియజెయ్యబడును
ఆసక్తి గల భాగవతులు తమ అభిప్రాయము డిసెంబర్ 15 వ తారీఖు లోపల తెలియజేయవలసి ఉంటుంది.
గదికి ఇద్దరు చొప్పున వసతి సౌకర్యము ఏర్పాటు చెయ్యబడుతుంది
మన రైలు ప్రయాణము హరిద్వార్ వరకు మరియు ఢిల్లీ నుండి మన గమ్యస్థానము వరకు 3RD AC లో ఉంటుంది.