1.శా :
శ్రీమన్మంగలపూర్ణసుందరశివ శ్రీనామ!
శ్రీ పార్వతీ
ధామా! సర్వసుపర్వకామితపరంధామా!
జపద్రామ నా
మా! మోఘీకృతనాస్తికప్రముఖకామా!
దివ్యభాగీరథీ
సీమీభూతజటాలలామ! గిరిశా!
శ్రీ నీలకంఠేశ్వరా!
తాత్పర్యము :
పూర్తిగా మంగళములతో నిండిన అందమైన, శుభప్రదమైన పవిత్రనామము కలవాడా! పార్వతీదేవికి నివాసమైనవాడా!(పార్వతీ దేవి ఎల్లప్పడూ శివుని శరీరంలో ఉంటుంది.) దేవతలందరిచేత కోరుకొనబడే పరమాత్మా!
రామనామాన్ని నిరంతరం జపించేవాడా!పరమనాస్తికులయొక్క కోరికలను వ్యర్థం చేసేవాడా!(అనగా నాస్తికత్వాన్ని తొలగించేవాడా!) దివ్యమైన గంగానదిని నీ జడలలో బంధించినవాడా!కైలాసగిరిపై నివసించేవాడా! శ్రీ నీలకంఠేశ్వరా!